Wednesday, January 15, 2025

మిలిటెంట్ల దాడుల్లో 100 మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

మిలిటెంట్ల దాడుల్లో 100 మందికి పైగా మృతి చెందిన ఘటనా ఆఫ్రికా దేశం నైజీరియాలో చోటు చేసుకుంది. ఈశాన్య రాష్ట్రం యోబేలో బొకోహరమ్ మిలిటెంట్లు గ్రామాలపై విరుచుకుపడ్డారు. యోబేలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో 60 మంది ఉగ్రవాదుల బైకులపై వచ్చి గ్రామస్థలపై దాడి చేశారు. ఇళ్లలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. భవనాలను తగలబెట్టి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 102 మంది చనిపోయినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.

ఇంకా చాలా మంది జాడతెలియలేదని, మృతుల సంఖ్య మరింతా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 2009 లో నైజీరియా ప్రభుత్వంపై తిరగుబాటుకు దిగిన బొకోహరమ్ మిలిటెంట్లు తరచూ గ్రామస్థులపై దాడులకు పాల్పడుతున్నారు. బొకోహరమ్ కార్యకలపాల గురించి గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిఘా వర్గాలు అనేక మంది బొకోహరమ్ సభ్యులను మట్టుబెట్టారు. అందుకు ప్రతికారంగానే దాడులకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News