Wednesday, January 8, 2025

భోళా శంకర్ వెల్‌కమ్స్ వాల్తేరు వీరయ్య..

- Advertisement -
- Advertisement -

సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రం గ్రాండ్ సక్సెస్‌తో మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. చిరు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ భారీ సక్సెస్‌తో అజిత్ ‘వేదాళం’ అధికారిక రీమేక్ అయిన భోళా శంకర్ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు చిరు. భోళా శంకర్ చిత్ర యూనిట్ సినిమా సెట్‌లో చిరుకు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చింది. ‘భోళా శంకర్ వెల్‌కమ్స్ వాల్తేరు వీరయ్య’ అంటూ చిత్ర యూనిట్ జోష్‌ను నింపింది. అంతేకాకుండా ఈ రెండు చిత్రాలకు సంబందించిన గెటప్‌లతో కూడిన కేక్ ను మెగాస్టార్ చిరు కట్ చేశారు. అనంతరం మరింత జోష్‌తో ఈ చిత్రాన్ని షురూ చేశారు.

‘భోళా శంకర్’లో మెగాస్టార్ చిరు సోదరిగా నటించిన కీర్తి సురేష్, చిత్ర దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకర, ఇతర నటీనటులు, సిబ్బంది చిరుకు పూల బొకేలతో స్వాగతం పలికి ‘వాల్తేరు వీరయ్య’ ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ‘భోళా శంకర్’ సినిమా యూనిట్‌కు చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’కు కాస్టూమ్స్ డిజైనర్‌గా చేసిన సుస్మిత ‘భోళాశంకర్’కు కూడా కాస్టూమ్స్ డిజైనర్‌గా చేస్తోంది. ‘భోళా శంకర్’లో చిరంజీవికి జోడీగా హీరోయిన్ తమన్నా నటిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News