‘గమనం’ సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా శరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను ఈ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర పేరు ఝారా. ఈ కారెక్టర్ కోసం కొన్ని రిఫరెన్స్‌లు తీసుకున్నాను.
నిత్య మీనన్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాను చూశాను. అలా ఈ పాత్రను పోషించడం కాస్త సులభంగా మారింది. డైరెక్టర్ కావడంతో సుజనా రావు నాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ‘గమనం’లో నాకు నటించే స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. శివ కందుకూరితో ఇది వరకే ‘చూసీచూడంగానే’ సినిమాను చేయాల్సింది. కానీ మిస్ అయింది. మొత్తానికి గమనం సినిమాతో కుదిరింది. హాసన్ గురించి చెప్పడానికి నేను ఎవరిని. ఆయనతో ఈ సినిమాలో వర్షంలో ఓ సీన్ ఉంటుంది. కథ నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. నాకు అందరు హీరోలతో పని చేయాలని ఉంది. ఓ లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. అందులో అయితే హీరోతో సమానంగా క్యారెక్టర్ ఉంటుంది. డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. బోల్డ్ కారెక్టర్ కూడా చేస్తా అని అన్నారు.