Sunday, December 22, 2024

బీబీనగర్ టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Bolero collided with parked truck: Two dead

బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ టోల్ గేట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బొలేరో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గుడిమల్కాపురం నుంచి వరంగల్ కు పూలు తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని వరంగల్ మాదాపూర్ చెందిన ఖలీల్ గా గుర్తించారు. డ్రైవర్ వివరాలు తెలియాల్సిఉంది. అదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ నుంచి వరంగల్ రూట్ లో వెళుతున్న సందర్భంలో అక్కడ ఆపి ఘటనాస్థలిని పరిశీలించారు. దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని  పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News