Saturday, December 21, 2024

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

గద్వాల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ధరూర్ మండలం పారుచర్ల స్టేజ్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఓ బొలేరో‌‌‌ వాహనం అదుపుతప్పి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గద్వాల పురపాలికలోని దౌదర్ పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News