- Advertisement -
జోకళ్ల: బోలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోకళ్లలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 30 మంది మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఓరురో, పోటోషి ప్రాంతాలలో ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 800 మీటర్ల లోతుగల లోయలో పడిపోవడంతో ఎక్కువ మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. పోటోషిలో గత సంవత్సరం జులైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బోలీవియాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో 1400 మంది మృతి చెందుతున్నారు.
- Advertisement -