ముంబయి: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) బుధవారం ఉదయం కన్నుమూశారు. శ్యాసకు సంబంధించిన సమస్యలతో హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దిలీప్ కుమార్ చనిపోయారని తెలియగానే బీటౌన్ శోకసంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ వర్గాలు విషాదంలో మునిగిపోయారు. దిలీప్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న జన్మించారు. 1944లో జ్వర్ భటా మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు. 60 ఏళ్ల జీవిత కాలంలో 60 సినిమాలు మాత్రమే చేశాడు. సినిమా షూటింగ్ మొదలు పెడితే రెండు సంవత్సరాల వరకు ఒక్క సినిమా మాత్రమే తీసేవాడు. దర్శకుడికి షాట్ నచ్చిన నచ్చకపోయినా తనకు షాట్ నచ్చితే మాత్రమే ఓకే చేసేవాడు. మొగల్ ఎ ఆజం సినిమాతో నట విశ్వరూపం చూపించాడు. దిలీప్ కుమార్ నటించిన ప్రతి సినిమా శతదినోత్సవం జరుపుకుందంటే అతడు ఏరేంజ్ లో నటించాడో తెలుస్తుంది. అందుకే ఆయనను బాలీవుడ్ లో ట్రాజెడీ కింగ్ అనే వారు.