Sunday, September 8, 2024

బుద్ధవనంలో బాలివుడ్ నటుడు సందడి

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్:నాగార్జునసాగర్‌లోని బుద్ధవనానికి ప్రపంచ దేశాలలో ప్రాధాన్యతను, ప్రాచుర్యం కల్పిస్తానని ప్రముఖ సినినటుడు క్రికెటర్ సిద్ధార్థ గౌతమ మూవీ గౌతమ బుద్ధ పాత్రధారి గగన్ మాలిక్ తెలిపారు. ఆయన గురువారం బుద్ధవనాన్ని సందర్శించి పులకించిపోయారు. అ ష్టాంగ మార్గ వనాలను శ్రీలంక బహుకరించిన బుద్ధ విగ్రహం, బుద్ధ పాదాలను దర్శించారు.

మహాస్తూపం, బుద్ధపాదాలను దర్శించారు. మహాస్తూపం అందులో కా ంతులీనుతున్న బుద్ధభగవాన్‌ని చూసి మహాదానందం పొందారు. బుద్ధవనం అభివృద్ధికికి అంతర్జాతీయంగా తన వంతు ప్రాచుర్యాన్ని కొనసాగిస్తానని, సహకారం అందిస్తానని ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యతో అన్నారు. బుద్ధవనంలోని ప్రతి శిల్పం తిలకించారు. బుద్ధవనం ప్రాధాన్యతలను విశేషాలను, ప్రముఖ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి వివరించారు.

గగన్ మాలిక్ బుద్ధునిగా నటించి ఐక్యరాజ్యసమితి తరుపున ఉత్తమ నటుడిగా అవార్డులు పొందారు. ఆ తర్వాత బౌద్దాన్ని ఆకర్షితుడై వియత్నాం, నేపాల్, శ్రీలంక తదితర దేశాలలో సందర్శించి ప్రచారం గావించారు. ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించిం ది. గగన్ మాలిక్ బుద్ధవనం సందర్శించడాన్ని మల్లేపల్లి లక్ష్మయ్య ప్రశంసించా రు. బుద్ధవనం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సుధాన్‌రెడ్డి, శ్యాంసుందర్, బౌద్ద అభిమానులు కె. కె రా జా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News