Monday, January 20, 2025

మొక్కలు నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో బాగంగా శంషాబాద్‌లోని పంచవటి పార్కులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. ఈ ఛాలెంజ్‌ని అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అనంతరం రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ ,అంజలీ చౌహాన్ ముగ్గురికి చాలెంజ్ విసిరిన కంగనా… ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి సంతోష్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News