Wednesday, December 4, 2024

ప్రేమజంటను తగలబెట్టి …. బాలీవుడ్ నటి సోదరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ఓ హత్య కేసులో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియాను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో అలియా తన మాజీ బాయ్ ఫ్రెండ్, అతడి గర్ల్ ఫ్రెండ్‌ను హత్య చేసి సజీవహనం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. న్యూయార్క్‌లో అలియా ఫక్రీ గత కొంత కాలంగా ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మనస్పర్థులు రావడంతో గత సంవత్సరం నుంచి విడిపోయారు. అనాస్టాసియా ఎటినీ అనే యువతితో జాకోబ్ ప్రేమలో పడడంతో డేటింగ్‌లో ఉన్నాడు. అలియా తన మాజీ లవర్ ఎడ్వర్డ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బెదిరింపులకు దిగింది. కోపంతో రగిలిపోయిన అలియా తన మాజీ లవర్ ఇంటిని తగలబెట్టింది.

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అప్పటికే జాకోబ్, ఎటినీ మృతి చెందారు. స్థానికుల వాంగ్మూలం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి అలియా ఫక్రీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె దోషిగా తెలితే జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటిరకు సోదరి అరెస్టుపై నర్గీస్ ఫక్రీ స్పందించలేదు. గత కొంత కాలంగా తన సోదరికి నర్గీస్ దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బాలీవుడ్ చిత్రాలలో మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. రాక్‌స్టార్, కిక్, హౌస్‌ఫుల్ చిత్రాలలో నటించారు. హౌస్‌ఫుల్ 5 సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News