Thursday, January 23, 2025

ఇజ్రాయెల్ నుంచి ముంబైకి సురక్షితంగా చేరుకున్న బాలీవుడ్ నటి

- Advertisement -
- Advertisement -

ముంబై : హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతున్న వేళ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ తార సుష్రత్ బరూచా క్షేమంగా ముంబైకి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల సుష్రత్ బరూచా ఇజ్రాయెల్‌కు వెళ్లి అక్కడ చిక్కుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆమె ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో ఆమె కుటుంబ సభ్యులు , అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు సుష్రత్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం అకస్మాత్తుగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా దిగిన తరువాత మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగ్గా తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఆమె సహచరులు ఫోన్ చేసి అక్కడి పరిస్థితి అడగ్గా తానొక బేస్‌మెంట్‌లో సురక్షితంగానే ఉన్నానని ఆమె చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News