Friday, December 20, 2024

బాలీవుడ్ లో విషాదం.. ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సెలబ్రెటీలు నితిన్ దేశాయ్ మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ముంబై సమీపంలోని కర్జాత్ లో ఉన్న తన స్టూడియోలో నితిన్ దేశాయ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలీవుడ్ లో లగాన్, దేవదాస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన నితిన్ దేశాయ్ ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News