Wednesday, January 22, 2025

బాలీవుడ్ లో విషాదం..

- Advertisement -
- Advertisement -

Bollywood Comedian Raju Srivastav Dies at 58

న్యూఢిల్లీ: బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో క‌మీడియ‌న్ రాజు శ్రీవాత్స‌వ్(58) బుధవారం కన్నుమూశారు. గత నెలలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో రాజు శ్రీవాత్సవ్ ను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. అప్పటీ నుంచి వెంటిలేట‌ర్‌పైనే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలీవుడ్ లో రాజు శ్రీవాత్సవ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో కమెడియన్ గా నటించి అలరించారు. కాగా, రాజు శ్రీవాత్స‌వ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

Bollywood Comedian Raju Srivastav Dies at 58

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News