- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్న తాజా చిత్రం ‘జాట్’. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో సన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్‌ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. దక్షిణాదిలో నటీనటులను ఎంతో గౌరవిస్తారని అన్నారు. సినిమాను ఎలా నిర్మించాలో టాలీవుడ్‌ని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. టాలీవుడ్‌లో పని చేయడం ఎంతో నచ్చిందని.. దక్షిణాదిలో మరో సినిమా చేయాలని అనిపిస్తుందని తెలిపారు. ఇక్కడే స్థిరపడాలని అనిపిస్తుందని కూడా అన్నారు. ఇక తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన జాట్ సినిమాలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -