Thursday, January 23, 2025

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఒకప్పటి మేటి నటి షర్మిలా ఠాగోర్ కుమారుడైన సైఫ్ అనేక హిందీ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తాజాగా కేరెక్టర్ రోల్స్ కూడా అంగీకరిస్తున్న సైఫ్, ఇటీవల ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’  మూవీలో రావణాసురుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

భుజం వద్ద, మోకాలి వద్ద ఎముకలు విరగడంతో ముంబాయిలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో సైఫ్ చేరాడు. అయితే అతను ఎలా గాయపడిందీ వివరాలు తెలియలేదు. సైఫ్ వెంట ఆస్పత్రిలో అతని భార్య కరీనాకపూర్ ఉన్నారు. సైఫ్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం నెట్ లో ప్రయత్నిస్తున్నారు. అయితే, ఒక సినిమా షూటింగ్ లోనే సైఫ్ గాయపడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News