Thursday, March 20, 2025

ఐపిఎల్ ఆరంభ వేడుకలో అలరించే స్టార్స్ వీళ్లే!

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ కోసం సన్నద్ధమయ్యారు. అయితే ఐపిఎల్ 18 ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలో పలువురు స్టార్లు ప్రేక్షకులను అలరించనున్నారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ ఈ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రముఖ సింగర్లు అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషల్ తమ పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. బాలీవుడ్ బ్యూటీలు శ్రద్ధా కపూర్, దిశా పటానీ, హీరో వరుణ్ ధవన్ ఈ వేడకలో డ్యాన్స్ చేయనున్నారు. వీరితో పాటు పంజాబ్ స్టార్ ర్యాపర్ కరణ్ ఔజ్లా ఓ ప్రత్యేక షో చేయనున్నారు. అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్‌ని కూడా ఈ వేడుకల్లో షో చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News