బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్- ప్యాక్డ్ మూవీ ‘జాట్’ కోసం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌తో భారీ అంచనాలను సృష్టించింది.
తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. పూర్తి యాక్షన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో సన్నీ డియోల్ అదరగొట్టాడు. రణదీప్ హుడాను మెయిన్ విలన్‌గా పరిచయం చేయడంతో టీజర్ థ్రిల్లింగ్ నోట్‌తో ముగిసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ -అప్పీలింగ్ యాక్షన్‌ని తీయడం లో తన ప్రతిభను అద్భుతంగా చూపించారు.
మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రిషి పంజాబీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని అ బ్బురపరిచే విధంగా చూపించాయి. ఈ చిత్రంలో వినీత్ కుమార్ సిం గ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 2025 వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.