Thursday, December 26, 2024

పాన్ ఇండియా స్టార్‌కు తాతగా..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మాళవిక మోహానన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించే ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి కూడా పాన్ ఇండియా అప్పీల్ రప్పించేందుకు మారుతి ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీని కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నారు. బోమన్ ఇరానీని ప్రభాస్ తాతగా చూపిస్తారని తెలిసింది. బొమన్ ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోనూ తాత పాత్రలో అదరగొట్టాడు. ఇప్పుడు ప్రభాస్‌కి తాతగా మరో ఛాన్స్ దక్కింది. బోమన్ బహుభాషా నటుడు. ముఖ్యంగా హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News