కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని బీర్బూమ్ జిల్లా మార్గ్రామ్‌లో ఆదివారం బాంబు దాడికి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందారు. ఆ పార్టీ పంచాయతీ చీఫ్ సోదరుడు లట్లూ షేక్ గాయపడ్డారు. షేక్‌ను స్థానిక ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఇటు అధికార టీఎంసీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య చిచ్చు రేపింది.కాంగ్రెస్ మద్దతుదారులే బాంబు దాడి జరిపారని మృతుడు న్యూటన్ షేక్ బంధువులు ఆదివారం ఆరోపించగా,
మార్గ్రామ్‌లో కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత బలం అంతగా లేదని, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి తోసిపుచ్చారు. దాడికి పాల్పడిన వారు, బాధితులు కూడా టీఎంసీకి చెందిన వారేనని చెప్పారు. గాయపడిన షేక్‌ను రాష్ట్ర మంత్రి ఫిర్హద్ హకీం పరామర్శించారు.ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని మంత్రి మీడియాకు చెప్పారు.