Thursday, January 9, 2025

పాకిస్థాన్‌లో బాంబు డిస్పోజల్ స్కాడ్ పైనే దాడి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో భద్రతా దళాలను లక్షంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆగడం లేదు. తాజాగా గ్వాదర్ పోర్టు సిటీ వద్ద బాంబు నిర్వీర్య దళంపై దాడి జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంకరా డ్యామ్ వద్ద ల్యాండ్‌మైన్లను తొలగిస్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది.

పోర్టుకు 25 కిమీ దూరంలో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని గ్వాదర్ ఎస్‌ఎస్‌పీ మొహసీన్ జోహైబ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. ఈ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే వేర్పాటు వాద సంస్త పోరాడుతున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News