Monday, December 23, 2024

సిపిఎం పార్టీ ఆఫీసుపై బాంబు దాడి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో సిపిఎం ప్రధాన పార్టీ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి  బైక్ పై వచ్చి ఆఫీస్ పై బాంబు విసిరి వెళ్లిపోయాడు. ఈ దృశ్యం సిసి టివిలో నిక్షిప్తమైంది. ఈ దాడిలో ఎవరు గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎకెజి సెంటర్ లో ఉన్న కొందరికి భారీ పేలుడు శబ్ధం వినిపించడంతో బయటకు వచ్చి చూడగా పార్టీ ఆఫీస్ కంపౌండ్ గోడ దెబ్బతిందని సిపిఎం కార్యకర్తలు వెల్లడించారు. కాంగ్రెసోళ్లు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని కమ్యూనిస్టు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు శాంతి యుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ముందు జాగ్రత్తగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ శుక్రవారం కేరళలో పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News