Tuesday, February 11, 2025

పాక్ సరిహద్దులో బాంబు పేలుడు..ఇద్దరు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్ అఖ్నూర్ సెక్టార్ లోని ఎల్‌వోసి సమీపంలో బాంబు పేలి గస్తీ కాస్తున్న జవాన్లలో ఇద్దరు మృతి చెందారు. తొలుత ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ఈ సంఘటనపై సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా సోమవారం రాజౌరీ జిల్లా లోని ఎల్‌వోసీ వెంబడి కాల్పులు జరగ్గా, ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News