Friday, January 10, 2025

పాక్ లో బాంబు పేలి 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: బాంబు పేలి 11 మంది మృతి చెందిన సంఘటన పాకిస్థాన్ దేశం వజీరిస్థాన్‌లోని గుల్మిర్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం రాత్రి షావల్ ప్రాంతం నుంచి దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతానికి వ్యాన్‌లో వెళ్తుండగా గుల్మిర్ కోట్ శివారులో ల్యాండ్‌మైన్ పేలడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ప్రభుత్వాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమయంలో వాహనంలో 16 మంది కార్మికులు ఉన్నట్టు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మూడు వారాల ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతంలో బాంబు పేలి 63 మంది చనిపోయారు. గత ఆదివారం ఫైసలాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది మరణించారు.

Also Read: చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News