Saturday, December 21, 2024

టిఎంసి నేత ఇంట్లో పేలిన బాంబు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ నియోజకవర్గంలో టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం చేపట్టనున్న ర్యాలీ వేదికకు 1.5 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. తూర్పూ మేదీనిపూర్ జిల్లా భూపతి నగర్‌లో టిఎంసి నేత ఇంట్లో శుక్రవారం అర్థ రాత్రి పేలుడు జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానినకి చేరుకొని ఇంట్లోకి బాంబులు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబులు తయారు చేస్తున్నారని బిజెపి ఆరోపణలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News