Monday, December 23, 2024

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటనలో కీలక సాక్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై మూడు రోజుల పాటు దర్యాప్తు జరిపిన ఢిల్లీ పోలీసులు ఎంబసీ దౌత్యాధికారిని బెదిరించడానికి జరిగిన కుట్రకు సంబంధించి కీలక ఆధారాలను కనుగొనడంతో ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ అభియోగాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనే విషయాన్ని అధికారులు ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలా అనే విషయాన్ని కూడా వారు పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. తక్కువ తీవ్రతతో పేలుడు జరిగిన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సిసి టీవీ కెమెరాలను పరిశీలించిన ఢిల్లీ పోలీసు అధికారులు జామియా నగర్‌నుంచి ఓ అనుమానితుడు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు. అనుమానితుడ్ని తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌తో పాటుగా పలువురు ఆటో డ్రైవర్లను వారు ప్రశ్నించారు.

‘ పృథ్వీరాజ్ రోడ్డులో పేలుడు సంభవించినట్లు సూచించే కీలక సాక్షాధారాన్ని మేము గుర్తించాం.ఘటనా స్థలంలో ఒక లేఖను ఉంచిన తీరు కూడా ఙజ్రాయెల్ హమాస్ ఘర్షణ కారణంగా ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందిని బెదిరించడానికి కుట్ర జరిగినట్లుగా కూడా అర్థమవుతోంది’ అని దర్యాప్తు గురించి తెలిసిన ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తక్కువ తీవ్రత కలిగిన ఈ పేలుడులో ఎవరూ గాయపడనప్పటికీ ఘటనా స్థలంలో ఇజ్రాయెల్ రాయబారినుద్దేశించి రాసిన ఓ నిందాపూర్వక లేఖను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన పేలుడు, లేఖ లభించడం అంతా కూడా 2021లో ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడును గుర్తు చేస్తున్నట్లు వారు చెప్తున్నారు. అప్పుడు ఇజ్రాయెలీ ఎంబసీ వద్ద జరిగిన పేలుడులో కొన్ని కార్లు ధ్వంసమయిన విషయం తెలిసిందే.

పృథ్వీరాజ్ రోడ్డులో రెండు భవనాల కాంపౌండ్ వాల్స్ మధ్య జరిగిన ఈ పేలుడులో ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఏవో నిర్ధారించుకోవడం కోసం శాంపిళ్లను దర్యాప్తు అధికారులు ఎన్‌ఎస్‌జి ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదిక అందిన తర్వాత తుది నివేదిక సమర్పించడానికి మరి కొన్ని రోజులు పట్టవచ్చని ఓ అధికారి చెప్పారు. తాము పెద్ద పేలుడు శబ్దం విన్నట్లుగా చెప్తున్న దాదాపు డజను మంది స్టేట్‌మెంట్లను తాను రికార్డు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆగిఉన్న ఓ వాహనాన్ని వారు కనుగొన్నట్లు ఆ స్టేట్‌మెంట్లను బట్టి తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News