Wednesday, January 22, 2025

వణికిన టర్కీ అంకారా..

- Advertisement -
- Advertisement -

అంకారా : టర్కీ రాజధాని అంకారా పార్లమెంట్ వద్ద టెర్రరిస్టు దాడి జరిగింది. పార్లమెంట్ సమీపంలోకి ఆదివారం ఓ కారు దూసుకువచ్చింది. అందులో నుంచి ఓ వ్యక్తి కిందికి దిగి పార్లమెంట్ భవనం గేటు వైపు పరుగులు తీస్తూ తనను తాను పేల్చుకున్నాడు. ఈ దారిలో పౌరులు కూడా వెళ్లుతుండగా ఘటన జరిగింది. పౌరులు తృటిలో తప్పించుకున్నారు. పార్లమెంట్ వద్ద భీకర పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ విన్పించింది. మానవ బాంబు దాడిగా భావిస్తున్న ఈ ఘటన తరువాత ఈ ప్రాంతంలో చాలా సేపటివరకూ మంటలు చెలరేగాయి.

ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఉగ్రవాదులు కారు దిగడం, తనను తాను పేల్చుకోవడం వంటి దృశ్యాలతో కూడిన ఫుటేజ్‌నే దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెలువరించింది. ఓ టెర్రరిస్టు తనను తాను పేల్చుకోగా , మరో వ్యక్తిని భద్రతా బలగాలు పట్టుకుని ఆత్మాహుతికి దిగకుండా తటస్థీకరించారు. టర్కీ పార్లమెంట్ సమావేశాలు దేశాధ్యక్షులు రెసెప్ తయీప్ ఎర్డోగాన్ ప్రసంగంతో ఆదివారం ఆరంభం కావల్సిన దశలోనే ఆత్మాహుతి దాడి జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News