ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు శుక్రవారం ప్రార్థనలవేళ ఓ మసీదు వద్ద జరిపిన బాంబు దాడిలో 15మంది గాయపడ్డారు. నాంగర్‌హర్ రాష్ట్రం త్రాయిలీ అనే పట్ణణంలో ఈ బాంబు దాడి జరిగింది. పర్వతాలతో కూడిన ఆ ప్రాంతంలో ఐఎస్ దాడులు అరుదేనని పరిశీలకులు చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో సున్నీలు అధికంగా ఉండగా, షియాలు అల్ప సంఖ్యాకులు. సున్నీ వర్గానికి చెందిన ఐఎస్ ఉగ్రవాదులు షియాలు లక్షంగానే ఆత్మాహుతి దాడులు, కాల్పులులాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. సున్నీ వర్గానికే చెందిన తాలిబన్లకూ, వీరికీ మధ్య అఫ్ఘాన్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యపోరు నడుస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు ఇప్పటివరకు 33మంది ఐఎస్ ఉగ్రవాదుల్ని హతమార్చామని, 600మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. తాలిబన్లు అఫ్ఘాన్‌లో ఆధిపత్యానికే పరిమితమవుతుండగా, ప్రపంచ ఆధిపత్యం కోపం జిహాద్(పవిత్ర యుద్ధం) అన్న సిద్ధాంతంతో ఐఎస్ ఉగ్రవాదులు పని చేస్తున్నారు.