Monday, December 23, 2024

బాంబు పెట్టారని నకిలీ కాల్ చేసిన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అల్ఫా హోటల్‌లో బాంబు పెట్టామని నకిలీ కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని మార్కెట్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఖమ్మం జిల్లాకు చెందిన గౌస్ పాషా కూకట్‌పల్లిలో ఉంటూ హ్యాపీ హోమ్స్ హోటల్‌లో వంటపనిచేస్తున్నాడు. రూమర్స్ వ్యాప్తి చేసి భయంపుట్టించాలని ప్లాన్ చేశాడు. డయల్ 100కు ఫోన్ చేసి తాను అల్ఫా హోటల్ వద్ద ఉన్నానని, ఇక్కడ ఇద్దరు హోటల్‌లో బాంబు పెట్టామని మాట్లాడుకుంటుండగా విన్నానని పోలీసులకు చెప్పాడు.

వెంటనే ఆల్ఫా హోటల్‌కు చేరుకున్న పోలీసులు ఫోన్ చేసిన గౌస్ పాషాకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అవుట్ ఆఫ్ ది సర్వీస్ అని వచ్చింది. బాంబు స్కాడ్‌ను పిలిపించిన పోలీసులు హోటల్‌ను పూర్తిగా తనిఖీ చేసి బాంబు పెట్టామని నకిలీ కాల్ చేశారని గుర్తించారు. వెంటనే ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలించి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మార్కెట్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News