Tuesday, November 5, 2024

శబరి ఎక్స్‌ప్రెక్స్‌కు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

Bomb Threat Call to Sabari Express

పోలీసుల తనికీలో ఫేక్ కాల్‌గా గుర్తింపు

హైదరాబాద్:  సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెక్స్ రైలులో బాంబు అమర్చినట్లు మంగళవారం నాడు ఫోన్ కాల్ రావడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రైల్వేస్టేషన్‌లో జిఆర్‌పి, స్థానిక పోలీసులు, బాంబు,డాగ్ స్క్యాడ్‌లతో శబరి ఎక్స్‌ప్రెక్స్ రైలుతో పాటు రైల్వే స్టేషన్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించిన అధికారులు బాంబు లేదని తెల్చిచెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా శబరి ఎక్స్‌ప్రెక్స్ రైల్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ రావడంతో తొలుత రైల్వే స్టేషన్ అధికారులు జిఆర్‌పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు రైలును నిలిపివేశారు. కాగా తనికీలు జరుగుతున్న సమయంలో ప్రయాణికులు భయంతో ఆందోళనకు గురయ్యారు. పోలీసుల తనికీలలో బాంబు లేదని తేలడంతో బాంబు బెదిరింపులకు పాల్పడిన ఆగంతకుడి ఫోన్‌కాల్‌పై దృష్టిసారి విచారణ చేపడుతున్నారు.

నాలుగు రాష్ట్రాల ప్రయాణీకులు 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళ రాష్ట్ర ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చటంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని శబరీ ఎక్స్‌ప్రెక్స్ రైలు కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 1,568 కిలోమీటర్ల మేర తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు శబరి ఎక్స్ ప్రెస్ ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అయితే గతంలో హైదరాబాద్ నుండి ఎర్నాకుళం వరకే ఉన్న ఈ రైలు క్యాపిటల్ సిటి తిరువంతాపురానికి ప్రయాణాన్ని పొడిగించారు. సుమారుగా 30 గంటల 25 నిమిషాల పాటు సాగే ఈ శబరీ ఎక్స్‌ప్రెక్స్‌లో బాంబు పెట్టినట్టు బెదిరింపులతో తెలంగాణతో పాటు ఆంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు ఆందోళన చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News