Tuesday, December 24, 2024

నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తే ఐదేళ్ల పాటు నిషేధం

- Advertisement -
- Advertisement -

ఇటీవల కాలంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు నకిలీ బాంబు కాల్స్ తరచూ వస్తున్నాయి. దాంతో యాజమాన్యాలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తోంది. నకిలీ కాల్స్ కేసులో దోషులుగా తేలితే ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు బీసీఏఎస్ వెల్లడించింది.

ఈ విషయంలో ప్రస్తుతం మూడు నుంచి ఆరు నెలల నిషేధం మాత్రమే ఉంది. నిందితులు ఏ ఎయిర్‌లైన్‌కు అయితే బెదిరింపులు చేశారో, దానివరకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తోంది. అయితే అన్ని సంస్థల విమానాలకు దీనిని వర్తింపజేయాలని బీసీఎఎస్ చూస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం దేశ వ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు ఒకే రోజు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపుల కారణంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News