Sunday, December 22, 2024

ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ఇండిగో విమానానికి బాంబ్‌ బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో ఫ్లైట్ 6E2211లోని లావేటరీలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ కనిపించిందని, భద్రతా ఏజన్సీలు తనిఖీలు నిర్వహించాల్సిందిగా కోరినట్లు సీఐఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో విమానాశ్రయ భద్రతా ఏజెన్సీల మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తీసుకెళ్లారు. అనంతరం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ద్వారా ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం విమానం బాంబ్‌ స్క్వాడ్‌, సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News