Wednesday, January 22, 2025

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

బేగంపేట ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈ మెయిల్ పంపించారు. అందులో బేగంపేట ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామని పేర్కొన్నారు. బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే పోలీసులను రంగంలోకి దింపి తనిఖీలు చేయించారు. డాగ్ స్కాడ్, బాంబ్ స్కాడ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎవరినీ ఎయిర్ పోర్టు వైపు రానివ్వలేదు.

తనిఖీలు నిర్వహించిన పోలీసులు బాంబు లభించకపోవడంతో తప్పుడు సమాచారం పంపించారని తేల్చారు. ఆకతాయిలు మెయిల్ చేశారా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలోను నాంపల్లి రైల్వే స్టేషన్‌లో, ప్రజాభవన్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేయడంతో పోలీసులు తనిఖీలు చేశారు. తీరా చూస్తే నకిలీ కాల్స్‌గా గుర్తించారు. మెయిల్ వచ్చిన ఐడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News