Thursday, January 16, 2025

ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌కు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మథురా రోడ్ లోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. పాఠశాల యాజమాన్యం అప్రమత్తమై వెంటనే సిబ్బందిని, విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. పోలీస్‌లు హుటాహుటిన బాంబు స్కాడ్‌ను అంబులెన్స్‌ను రప్పించారు.

స్కూలులో తనిఖీలు చేయగా, తమకెలాంటి బాంబు కనిపించలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఈ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల లోనూ ఢిల్లీ లోని సాదిఖ్ నగర్ ప్రాంత ఇండియన్ స్కూలు ప్రాంగణంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈ మెయిల్ చేయగా అప్పుడు తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్ధాలు కనిపించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News