Monday, December 23, 2024

ధీరూభాయి అంబానీ పాఠశాలకు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త , రిలయన్న్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన బాంద్రా కుర్లా ప్రాంతం లోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు పాఠశాల ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి పాఠశాలలో టైంబాంబు పెట్టామని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు.

దీంతో పాఠశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటన తనిఖీ చేయగా ఎలాంటి బాంబు కనిపించలేదు. ఫోన్‌కాల్ ఆధారంగా ఆగంతకుడిని విక్రమ్‌సింగ్‌గా గుర్తించామని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. గతం లోనూ అంబానీ కుటుంబానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఇప్పుడు అంబానీ పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News