- Advertisement -
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో విమానాశ్రయ అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. విమానాశ్రయం ఆవరణలో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తం అయిన ఎయిర్‌పోర్టు అధికారులు ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపివేసి బాంబ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన అధికారులు, ప్రయాణికుల్లో భయాందోళనకు గురి చేసింది. ఎయిర్ పోర్టు లోకి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. విమానాశ్రయంలోని అందరికీ భద్రత కల్పించేందుకు అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
- Advertisement -