Saturday, November 23, 2024

గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు… హైదరాబాద్‌లో ఒకరు అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

పుణె: మహారాష్ట్ర లోని పుణె సిటీ గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆఫీస్ ఆవరణలో బాంబు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడంతో సిబ్బంది, యాజమాన్యం అప్రమత్తమయ్యారు. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా, అది ఉత్తుత్తి బెదిరింపేనని తేలింది. మద్యం మత్తులో అజ్ఞాత వ్యక్తి ఈ బెదిరింపు కాల్ చేసినట్టు తెలుసుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా కనుగొని చివరకు పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. “ పుణె లోని ముంద్వా ప్రాంతం బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ 11 వ ఫ్లోర్‌లో గూగుల్ కార్యాలయం ఉంది.

ఆఫీస్ ఆవరణలో బాంబు పెట్టిన సమాచారం ఆదివారం రాత్రి 7.54 గంటలకు అందిందని, వెంటనే పుణె పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్కాడ్ అక్కడకు చేరుకుని గాలించారని, గూగుల్ కార్యాలయ ఆవరణలో బాంబు అమర్చడం ఉత్తదే అని తేలినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ దేశ్ ముఖ్ చెప్పారు. కాల్ చేసిన నిందితుడి ఆచూకీ హైదరాబాద్ అని తెలుసుకుని అతడ్ని అదుపు లోకి తీసుకున్నామని తెలిపారు. మద్యం మత్తులో ఫోన్ చేసినట్టు తెలుస్తోందన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News