హైదరాబాద్ : నగరంలోని బషీర్ బాగ్ పరిధిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు. హుటాహుటిన కార్యాలయంలోని ఐటీ సిబ్బంది, అధికారులు ప్రాణభయంతో వెలుపలికి ఉరుకులు పరుగులు పెట్టారు. ఐటీటవర్స్ పరిధిలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి బాంబు బెదిరిపు ఫోన్ రావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్వ్కాడ్ తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకున్నారు.
ఐటి టవర్స్ ప్రాంతాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ బాంబులు గానీ లేవని నిర్థారించారు. దీంతో అటు పోలీసులు, ఇటు ఐటి శాఖ సిబ్బంది, అధికారులు అంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఐటి టవర్స్‌లో బాంబు ఉందని పోలీసులకు ఫొన్ చేసి బాంబు ఉందని తొలుత ఓ ఆగంతకుడు చెప్పాడు. పోలీసులతో ఫోన్ మాట్లాడుతూనే ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు.