Monday, December 23, 2024

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

Bomb threat to IndiGo flight

ముంబై : ఇండిగో విమానాన్ని బాంబులతో పేల్చివేస్తామని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆగంతకులు సమాచారం పంపారు. దీనితో శనివారం తీవ్రకలకలం చెలరేగింది. అధికారులు భద్రతా సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. అహ్మదాబాద్‌కు ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన ఇండిగోలో బాంబు పెట్టామని పేలుతుందని ఎయిర్‌పోర్టుకు ఇ మొయిల్ అందింది. అన్ని విధాలుగా గాలింపులు జరిపిన తరువాత ఎటువంటి బాంబు ఇతర పేలుడు పదార్థాల ఉనికి లేదని నిర్థారించుకున్న తరువాత ఈ 6ఇ 6045ఇండిగో ఎగిరేందుకు అనుమతిని ఇచ్చారు. తాము ఇప్పుడు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశామని, ఈ సమాచారం పంపిన వారు ఎవరనేది కనుగొంటున్నామని సీనియర్ పోలీసు అధికారి సంజయ్ గోవిల్కర్ తెలిపారు. ఈ బాంబు సమాచారం ఘటన తరువాత ముంబైలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పాట్లును కట్టుదిట్టం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News