Monday, December 23, 2024

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు రావడంతో న్యూఢిల్లీ నుంచి దేవ్‌గఢ్ వెళ్తే ఇండిగో విమానాన్ని లక్నోకు మళ్లించినట్లు ఇండిగో ఎయిర్‌లైనస్ సోమవారం తెలిపింది. అనంతరం భద్రతాపరమైన తనిఖీల తర్వాత విమానాన్ని దేవ్‌గఢ్‌కు పంపించినట్లు ఒక ప్రకటనలో ఎయిర్‌లైన్స్ తెలిపింది.

తాము భద్రతా సంస్థల ఆదేశాలను పాటించినట్లు ఇండిగో తెలిపింది. నిర్దిష్టమైన బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ధిల్లీ నుంచి దేవ్‌గఢ్ వెళ్లే ఇండిగో 6ఇ 6191 విమానాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోకు మళ్లించినట్లు ఇండిగో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News