Monday, December 23, 2024

హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం అలజడి సృష్టించింది. ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఇండిగో విమానం జబల్‌పూర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరింది. దాదాపు 9 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్ లోకి వెళ్లగా కమోడ్ సీటుపై “బ్లాస్ట్” అని రాసి ఉన్న పేపర్ కనిపించింది.

వెంటనే సిబ్బందికి చెప్పడంతో పైలట్ అప్రమత్తమై విమానసిబ్బందికి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. ఉదయం 9.20 గంటలకు విమానం నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో దిగిన తరువాత ప్రయాణికులను దించివేసి తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. విమానంలో 69 మంది ప్రయాణికులు , నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను బస్సులో హైదరాబాద్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News