- Advertisement -
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. తిరువనంతపురంలోని సిఎం అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లకు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో కేరళ పోలీసులు వెంటనే అప్రమత్తమై.. స్నిఫర్ డాగ్‌లు, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. అధికారులు ఎయిర్ పోర్టులోని అన్ని ప్రాంగణాలను బాంబు స్క్వాడ్‌లతో తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని.. ఆకతాయిలే ఈ బెదిరింపులకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
- Advertisement -