Friday, January 10, 2025

కేరళ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు.

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్‌లోని సిబ్బందిని బయటకు పంపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో అమర్పిన పేలుడు పదార్థాలను పేల్చేస్తామంటూ ఆ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గురువారం ఉదయం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో సచివాలయం ఆవరణ, వెలుపల క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

పార్కింగ్ ప్లేస్‌లోని వాహనాలతోపాటు సమీపంలో ఉన్న షాపులను కూడా తనిఖీ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కాగా, కేరళ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ ఫేక్ అని తనిఖీల తర్వాత పోలీసులు నిర్ధారించారు. ఫోన్ కాల్ చేసిన నిందితుడ్ని గుర్తించడంతోపాటు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలుస్తున్నదని చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సెక్రటేరియట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News