Sunday, December 22, 2024

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భారీగా పోలీసు బలగాలు తరలివచ్చాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసు బలగాలతో పాటు వివిధ విభాగాలకు చెందిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉండగా, మౌలాలి స్టేషన్ వద్ద కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ని నిలిపివేశారు. బోగీలన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News