- Advertisement -
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ అందింది. అధికారులు ఈ విశయాన్ని కలెక్టర్ గౌతమ్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి కలెక్టరేట్ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు డాగ్ స్కాడ్ బృందాలతో కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊరిపి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు తప్పుడు సమాచారమేనని పోలీసు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు.
- Advertisement -