Monday, December 23, 2024

ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

వెంటనే పోలీసుల అప్రమత్తం
రెండు గంటల పాటు తనిఖీలు
ఫేక్ కాల్‌గా గుర్తింపు
పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఆగంతకుడి ఫోన్
పరుగులు తీసిన పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది

మనతెలంగాణ, సిటిబ్యూరోః ప్రజాభవన్, నాంపల్లికోర్టులో బాంబు పెట్టామని ఓ ఆగంతకుడు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చేప్పడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అలియా స్ ధనసరి అనసూయ ఉంటున్నారు. బాంబు విషయం తెలియగానే పోలీసులు, బాంబు స్కాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన ప్రజాభవన్‌కు పరుగులు తీశారు. డిప్యూటీ సిఎం దంపతులు, మంత్రి సీతక్క కుటుంబ సభ్యులను బయటికి పంపించి అణువణువు తనిఖీలు చేపట్టారు. బాంబు విషయం తెలియగానే రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.

బాంబ్, డాగ్ స్క్వాడ్ ప్రజాభవన్ చేరుకొని అణువణువు తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రజా భవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. ప్రజా భవన్‌లో రెండు గంటలకు పైగా తనిఖీలు చేశారు. తనిఖీల తర్వాత అది ఫేక్ కాల్‌గా పోలీసులు తేల్చారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని పోలీసులకు ఫోన్ రావడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్‌తో కోర్టుకు చేరుకుని అనువణువు తనిఖీలు చేశారు. ఎక్కడా కోర్టులో బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో ఫేక్ కాల్‌గా పోలీసులు తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News