Wednesday, January 22, 2025

పంజాబ్‌లో సోమ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

రైలులో బాంబు పెట్టినట్లు ఒక అపరిచిత వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో జమ్మూ, రాజస్థాన్ మధ్య నడిచే సోమ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని కసు బేగు రైల్వే స్టేషన్‌లో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ రైల్లో నుంచి కసు బేగు రైల్వే స్టేషన్‌లో దింపివేసి రైలును క్షుణ్ణంగా తనిఖీ జరిపినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీరులోని జమ్మూ తావి, రాజస్థాన్‌లోని భగత్ కీ కోఠి మధ్య ఈ రైలు నడుస్తుంది.

సోమ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉన్నట్లు పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ రావడంతో ఫిరోజ్‌పూర్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసు బేగు రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెట్ సౌమ్య మిశ్రా తెలిపారు. ఆ ప్రాంతాన్ని పోలీసులతో దిగ్బంధించి ప్రయాణికులను రైలు నుంచి కిందకు దింపివేసినట్లు ఆమె తెలిపారు. పంజాబ్ పోలీసు నుంచి మూడు బాంబు డిస్పోజల్ బృందాలను, జాగిలాలను రప్పించినట్లు ఆమె చెప్పారు. బిఎస్‌ఎఫ్ సిబ్బందిని కూడా రప్పించినట్లు ఆమె వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News