Thursday, January 23, 2025

టిసిఎస్‌కు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టిసిఎస్‌కు గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి టిసిఎస్ మాదాపూర్ బిల్డింగ్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. టిసిఎస్ ఆఫీస్‌కు చేరుకున్న పోలీసులు విస్కృతంగా తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించారు.

దీంతో ఫోన్ చేసిన వ్యక్తి గురించి విచారణ చేసిన పోలీసులు బాంబు పెట్టింది టిసిఎస్ మాజీ ఉద్యోగిగా నిర్దారించారు. సదరు వ్యక్తిని పోలీసులు పట్టుకునేందుకు గాలిస్తున్నారు. కంపెనీలో బాంబు లేదని తేలడంతో ఉద్యోగులు,పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News