Monday, December 23, 2024

విశాఖ-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు హైదరాబాద్ విమానాశ్రయానికి ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని చెప్పాడు. దీంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే విశాఖ విమానశ్రయానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన విశాఖ విమానాశ్రయ అధికారులు అప్పటికే విశాఖ నుంచి ముంబై బయలుదేరిన ఇండిగో విమనాన్ని వెనక్కి రప్పించారు. ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణీకులను కిందకు దింపి భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. విమానంలో బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి విశాఖ నుంచి ముంబైకి బయల్దేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News