Thursday, December 26, 2024

ఢిల్లీలో 8 విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని ఎనిమిది విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, సాకేత్‌లోని అమిటీ స్కూల్, ద్వారక, వసంతకుంజ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పాఠశాలల నుంచి పిల్లలు, సిబ్బందిని ఇంటికి పంపారు. పాఠశాలల్లో బాంబు స్కాడ్, అగ్నిమాపక సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News