Thursday, December 26, 2024

ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్టు మంగళవారం డయల్ 100కు ఫోన్ చేసిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి వాసి శివకుమార్‌ని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నాంపల్లి పోలీసులకు అప్పగిం చారు. మంగళవారం ఉదయం పంజాగుట్ట ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని కాసేపట్లో పేలుతుందని ఫోన్ చేసి నిందితుడు శివకుమార్ టెన్షన్ క్రియేట్ చేశాడు. భార్యతో గొడవ పడి మద్యానికి బానిసై డిప్రెషన్‌లో ఇలా చేశానని పోలీసులకు వెల్లడించాడు. గతంలో బైక్ చోరీల కేసులో శివకుమార్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News